ETV Bharat / city

'బంజారా సినిమా ట్రైలర్​పై చర్యలు తీసుకోండి'

బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కించపరుస్తూ అసభ్యకరంగా సినిమాలు చిత్రీకరించడాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర గిరిజన సంఘం సెన్సార్​ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బంజార సినిమా ట్రైలర్​ను తక్షణమే యూట్యూబ్​ నుంచి తొలగించాలని డిమాండ్​ చేసింది.

complaint on banjara movie trailer
'బంజారా సినిమా ట్రైలర్​పై చర్యలు తీసుకోండి'
author img

By

Published : Mar 5, 2020, 8:07 PM IST

బంజారా మనోభావాలను గాయపరిచే విధంగా చిత్రీకరించిన బంజారా సినిమాను విడుదల నిలిపివేయాలని యూట్యూబ్​లో ఉన్న బంజారా ట్రైలర్​ను తొలగించాలని రాష్ట్ర గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ డిమాండ్ చేశారు. బంజారా సినిమాలోని అసభ్యకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కవాడిగూడలోని సెన్సార్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ గిరిజన సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు.

చర్యలు తీసుకోకుంటే..

బంజారా సినిమా దర్శకులు నాగుల్, నిర్మాత రమేశ్​ బాబు, నవీన్ 15 రోజుల క్రితం విడుదల చేసిన సినిమా ట్రైలర్ యూట్యూబ్​లో వైరల్​గా మారిందని, దీన్ని వెంటనే తొలగించాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంపై సెన్సార్ బోర్డు కఠినంగా స్పందించాలని కోరారు. బంజారా మహిళలు వేశ్య వృత్తి చేసే వారిగా సినిమాలో చిత్రీకరించడం.. తమ మనోభావాలు దెబ్బ తీయడంతో సమానమని మండిపడ్డారు. తగు చర్యలు తీసుకోని పక్షంలో దర్శక నిర్మాతల ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర గిరిజన సంఘం ఆందోళన

ఇవీ చూడండి: మురుగు సమస్య పరిష్కారానికి ఇంటినే పైకి లేపేస్తున్నారిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.