ETV Bharat / city

జై జవాన్​, జై కిసాన్ నినాదంతో ముందుకెళ్తాం: రేవంత్​రెడ్డి - తెలంగాణ రాజకీయ వార్తలు

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించవచ్చని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి అన్నారు. వాటిని సాకుగా చూపి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే మూడేళ్ల పాటు జై జవాన్​, జై కిసాన్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు.

revanth
జై జవాన్​, జై కిసాన్ నినాదంతో ముందుకెళతాం: రేవంత్​రెడ్డి
author img

By

Published : Feb 17, 2021, 4:47 PM IST

రాబోయే మూడేళ్లు పాటు జై జవాన్​, జై కిసాన్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీ ఒక్కటయ్యారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. సమస్యల మీద మనమే పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్​ కోసం ఇంటికొకరు చొప్పున యువత బయటకు రావాలని కోరారు.

పార్టీ నేతలు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క సూచనలతో రాజీవ్​ రైతు భరోసా యాత్రను చేసినట్లు రేవంత్​రెడ్డి వివరించారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేందుకు పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

సాగుచట్టాలను సాకుగా చూపి..

కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో వ్యవసాయ శాఖ ఉన్నందున నూతన సాగుచట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించవచ్చన్నారు. వాటిని సాకుగా చూపి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

లాభసాటి ప్రభుత్వరంగ సంస్థలను.. కేంద్రం ప్రైవేటుపరం చేస్తోందని.. దీన్ని దుర్మార్గమైన చర్యగా రేవంత్​ అభివర్ణించారు. రైతుల హక్కులను బహుళజాతి కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

జై జవాన్​, జై కిసాన్ నినాదంతో ముందుకెళతాం: రేవంత్​రెడ్డి

ఇవీచూడండి: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో జూ. ఎన్టీఆర్ సందేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.