ETV Bharat / city

బల్దియా నూతన మేయర్​ ఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరం - Ghmc Mayor Election news

జీహెచ్​ఎంసీ నూతన మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్​ అధికారి శ్వేతామహంతి పరిశీలించారు. కమిషనర్ లోకేశ్​ కుమార్​తో పాటు అధికారులు, కార్యదర్శులతో సమీక్షించారు.

collector Swetha mahanthi inspected Ghmc Mayor Election Arrangements

author img

By

Published : Feb 4, 2021, 7:28 PM IST

ఈ నెల 11న జరుగనున్న జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్​ ఎన్నిక కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ ఎన్నికల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్, ఎన్నికల విభాగం అధికారులు, కార్యదర్శులతో సమావేశమైన అనంతరం కౌన్సిల్​ హాల్​ను శ్వేతామహంతి పర్యవేక్షించారు.

ఎక్స్ అఫీషియో, కార్పొరేటర్లకు పార్టీల వారిగా సీట్ల కేటాయింపు, కౌన్సిల్ హాల్​లోకి ప్రవేశం, మీడియా ఎన్​క్లోజర్ తదితర అంశాలను పరిశీలించారు. 11న జరిగే సమావేశాన్ని పూర్తిస్థాయి వీడియోగ్రఫీ చేయించాలని సంబంధిత అధికారులకు శ్వేతామహంతి ఆదేశించారు.

ఇదీ చూడండి: రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై అధికారులతో సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.