నియంత్రిత పంటల సాగుపై ఈనెల 21న సీఎం అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సీఎం భేటీ కానున్నారు. జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై చర్చించనున్నారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది.
ఈరోజు,రేపు.. వ్యవసాయ, వర్సిటీ అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి సమీక్షించనున్నారు. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి అనే దానిపై నివేదిక సిద్ధం చేయనున్నారు. వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ, ఎంత వేయాలి? అనే అంశాలను ఖరారు చేస్తారు. జిల్లాల వారీగా పంటల మ్యాప్‌లను కూడా రూపొందించనున్నారు.
పంటల మ్యాప్‌పై సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి.. ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవీ చూడండి: కేంద్రం ప్యాకేజీ డొల్ల... ముఖ్యమంత్రి గుస్సా