కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సీఎంకు సిటీ స్కాన్, సహా ఇతర పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. కేసీఆర్ వెంట... మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులున్నారు.
సీఎంకు సాధారణ పరీక్షలు నిర్వహించాం. సిటీ స్కానింగ్ చేశాం.. నార్మల్‌గానే ఉంది. కొవిడ్ లక్షణాలు పోయాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. ఊపిరితిత్తుల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉంది.
- సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు
ఈనెల 19న సీఎంకు నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సీఎస్ తెలిపారు. నిన్న మరోసారి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనూ పాజిటివ్ వచ్చింది.
ఇవీచూడండి: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్