ETV Bharat / city

రైతులంతా ఏకమై పంటకు ధర నిర్ణయించుకోవాలి: కేసీఆర్​

author img

By

Published : Oct 31, 2020, 7:42 PM IST

రైతులను ఐక్యంచేసి వారి సంఘటిత శక్తి ప్రపంచానికి తెలియచేసేందుకే రైతు వేదికలను నిర్మించినట్టు సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన ముఖ్యమంత్రి.... మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తెలంగాణ రైతును దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని ప్రతిజ్ఞ తీసుకున్నట్టు పునరుద్ఘాటించారు. అబద్దాలతో కాంగ్రెస్‌, భాజపా ప్రజల్నితప్పుదోవ పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం రైతుల మెడపై కత్తిగా సీఎం అభివర్ణించారు.

cm kcr suggested to farmers integrity for deciding paddy purchase cost
రైతులంతా ఏకమై పంటకు ధర నిర్ణయించుకోవాలి: కేసీఆర్​
రైతులంతా ఏకమై పంటకు ధర నిర్ణయించుకోవాలి: కేసీఆర్​

రైతులు ఐక్యమైతేనే వారు పండించిన పంటకు వారే ధరను నిర్ణయిస్తారని... అందుకు రైతువేదికలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి సందర్శించారు. కొడకండ్ల మార్కెట్‌యార్డులో నిర్వహించిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం... దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రైతువేదికలకు శ్రీకారం చుట్టామన్నారు.

రాజీనామాకు సిద్ధం

రాష్ట్రంలో నిర్మాణాత్మకంగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్‌ మండిపడ్డారు. సన్నధాన్యం విషయంలో కాంగ్రెస్‌, పింఛన్ల నిధుల విషయంలో భాజపా... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. రాష్ట్రంలో రూ.11 వేల కోట్లతో పింఛన్లు ఇస్తుండగా.... కేంద్రం రూ105 కోట్లు మాత్రమే ఇస్తోందన్న కేసీఆర్​... తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే నిమిషంలో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. విపక్షాలు ఎంత అసత్య ప్రచారం చేసినా... దుబ్బాకలో తెరాస గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

రైతులను ఆదుకుంటాం

కేంద్రం ఏకపక్షంగా తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం ముమ్మాటికీ దేశంలో రైతులకు మేలు చేయదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆ చట్టాన్ని తెచ్చిన కేంద్రంపై కర్షకులంతా పిడికిలెత్తి యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. సన్నధాన్యానికి మద్దతు ధర ఇప్పించే బాధ్యత సర్కార్‌దేనని హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులున్నా... మక్కలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఎస్సీల అభ్యున్నతి కోసం

రైతు ఖాతాలో సొంత పెట్టుబడి నిల్వలు ఉన్నరోజే బంగారు తెలంగాణ సాకారమైనట్లని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కోటి ఎకరాల్లో వరి ధాన్యం పండించే మాగాణిగా తెలంగాణ తయారైందన్న కేసీఆర్‌... దేశానికే దిక్సూచిలా మన అన్నదాత మారాడని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీల అభ్యున్నతి కోసం త్వరలో దళిత ఛైతన్య జ్యోతి కార్యక్రమం తీసుకువచ్చే ఆలోచన ఉందని సీఎం కొడకండ్ల వేదికగా ప్రకటించారు.

ఇదీ చూడండి: అబద్ధమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.