ETV Bharat / city

ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారుకావాలి: కేసీఆర్​ - CM KCR SPEAKS ON FLOOD MANAGEMENT OF TELANGANA

CM KCR SPEAKS ON FLOOD MANAGEMENT OF TELANGANA
ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారుకావాలి: కేసీఆర్​
author img

By

Published : Aug 17, 2020, 6:22 PM IST

Updated : Aug 17, 2020, 7:35 PM IST

18:18 August 17

ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారుకావాలి: కేసీఆర్​

భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మరో 3, 4 రోజులపాటు భారీ, అతిభారీ వర్ష సూచనతో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.  

ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సహాయక చర్యలకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడవద్దని.. అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతిరోజు నివేదిక తెప్పించుకోవాలని సీఎం సూచించారు.  

ప్రకృతి వైపరీత్యం తలెత్తినా సరే అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. డిమాండ్‌లో వ్యత్యాసం వచ్చినా గ్రిడ్ ఫెయిల్ కాకుండా సమర్ధంగా పనిచేశారని అధికారులను ఆదేశించారు.  

జిల్లాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువులు నిండాయని.. నదులు, వాగులు, వంకలు పొంగుతున్నాయన్నారు. ఇప్పటివరకు పరిస్థితి అదుపులోనే ఉందని.. రాబోయే మూడు నాలుగు రోజులు ముఖ్యమని అధికారులతో సీఎం అన్నారు.  

మరో అల్పపీడనం..  

ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 19 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  

వాతావరణం బాగాలేదని.. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దని సీఎం సూచించారు.  

భద్రాచలంపై ఆరా..  

గోదావరి నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందన్న కేసీఆర్.. ఏటూరు నాగారం, మంగపేటతో పాటు గోదావరి ముంపు గ్రామాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్​ ఆదేశించారు. ఈ శిబిరాల్లో అందరికీ కావాల్సిన వసతి, భోజనం ఏర్పాట్లు చేయాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు అందించాలని సూచించారు.  

ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ..

పంట నష్టంపై వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు తయారుచేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. విపత్తులు వచ్చినప్పుడు అనుసరించాల్సిన శాశ్వత వ్యూహాన్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. పట్టణాల్లో మున్సిపల్, పోలీస్‌శాఖలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విపత్తు జరిగిన వెంటనే రంగంలోకి దిగే విధంగా వారిని సిద్ధం చేయాలని సూచించారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారుకావాలని సీఎం ఆకాంక్షించారు.  

రేపు వరంగల్​కు మంత్రుల బృందం..  

వరంగల్‌లో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు.  వరంగల్‌లో చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్‌లో స్వయంగా పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు.  సీఎం ఆదేశాలతో రేపు వరంగల్‌లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్​, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్​ పర్యటించనున్నారు. రేపు వరంగల్ ఎంజీఎంను సందర్శించనున్న మంత్రుల బృందం.. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనుంది. వర్షాలు, వరదలు, కరోనా పరిస్థితిని సమీక్షించనుంది.  

ఇవీచూడండి: వరదలో చిక్కిన యువకుడ్ని కాపాడిన వాయుసేన

Last Updated : Aug 17, 2020, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.