CM KCR Comments on Cloud Burst: "క్లౌడ్ బరస్ట్"పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుండపోత వర్షంపై ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఇవి ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలం వెళ్లిన ఆయన.. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
విదేశీయులు కావాలనే మన దేశంలో అక్కడక్కడా "క్లౌడ్ బరస్ట్" చేస్తున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో జమ్మూకశ్మీర్‌లోని లేహ్, లద్దాఖ్.. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో ఇలా చేశారన్నారు. ఇటీవల గోదావరి పరీవాహక ప్రాంతంపై అలా చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. ఏదేమైనా ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
"క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని వెనుక ఏవో కుట్రలున్నాయన్నట్టు చెప్తున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలవదు. ఇతర దేశాల వాళ్లు కావలనే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో కూడా కశ్మీర్‌లోని లద్దాఖ్‌లో లేహ్‌లో చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో చేశారు. ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతాలపై చేస్తున్నట్టు మనకు చూఛాయగా సమాచారం వస్తోంది. ఏదేమైనప్పటికీ.. వాతావరణంలో జరిగే మార్పుల వల్ల ఇలాంటి ఉత్పాతాలు వస్తుంటాయి. ఈ సందర్భాలలో ప్రజలను కాపాడుకునే బాధ్యత మనపై ఉంటుంది." - సీఎం కేసీఆర్
ఇదీ చూడండి: