ETV Bharat / city

CM KCR On Dalit Bandhu: దళిత బంధు కోసం రూ.లక్ష కోట్లు: సీఎం - cm kcr said Government are ready to spend Rs 1 lakh crore on Dalitha bandhu

CM KCR On Dalit Bandhu
CM KCR On Dalit Bandhu
author img

By

Published : Jul 24, 2021, 7:31 PM IST

Updated : Jul 24, 2021, 8:22 PM IST

19:26 July 24

CM KCR: దళిత బంధు కోసం రూ.లక్ష కోట్ల ఖర్చుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం

దళిత బంధు కోసం రూ.లక్ష కోట్ల ఖర్చుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం

దళితబంధు పథకానికి దశలవారీగా 80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కాళ్లు, చేతులు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని స్పష్టం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్​గా బండా శ్రీనివాస్​ను నియమించినందుకు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

దేశానికే ఆదర్శంగా...

ప్రగతిభవన్​కు తరలివచ్చిన నేతలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్... దళితబంధు పథకం గురించి వివరించారు. హుజూరాబాద్​లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు పథకం... కేవలం తెలంగాణలోనే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ పథకం దేశ ఎస్సీలందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతోందని ముఖ్యమంత్రి తెలిపారు. పట్టుదలతో తామందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: 

CM KCR Phone Call: హుజూరాబాద్​పై కేసీఆర్ మాస్టర్​ ప్లాన్.. ఆడియో వైరల్

Last Updated : Jul 24, 2021, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.