ETV Bharat / city

CM KCR Review On RTC: ఆర్టీసీని గట్టెక్కించే ప్రయత్నం ప్రారంభమైంది: కేసీఆర్​

author img

By

Published : Sep 21, 2021, 3:06 PM IST

Updated : Sep 21, 2021, 10:37 PM IST

CM KCR Review On RTC
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

15:02 September 21

CM KCR Review On RTC: ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది: కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్షించారు(CM KCR Review On RTC). ఆర్టీసీని గట్టెక్కించే ప్రయత్నం ప్రారంభమైందని సీఎం తెలిపారు. రెండేళ్ల క్రితమే పటిష్టమైన చర్యలు చేపట్టామన్న కేసీఆర్​.. గాడిలో పడుతున్న దశలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని చెప్పారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 

 కరోనా–లాక్​డౌన్​తో పాటు కేంద్రం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరల కారణంగా ఆర్టీసీ ఆర్ధికంగా నష్టాల్లో కూరుకుపోతున్నదని, ఆర్టీసీని ఆర్ధిక సంక్షోభం నుంచి ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి సహా ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఉన్నతాధికారులు సీఎంకు విన్నవించుకున్నారు. గత సంవత్సరంన్నర కాలంలో డీజీల్ ధరలు లీటరుకు రూ. 22 రూపాయలు పెరగడం మూలాన ఆర్టీసీ పై రూ. 550 కోట్లు అదనపు ఆర్ధిక భారం పడుతున్నదని అధికారులు సీఎంకు వివరించారు. డీజిల్​తో పాటు టైర్లు ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతున్నదన్నారు. వీటన్నిటి ద్వారా మొత్తంగా రూ.600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయవలసి వస్తున్నదని తెలిపారు. 

కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసి పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు వాపోయారు. లాక్​ డౌన్​ వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్ట పోయిందని ఆర్టీసీ అధికారులు సీఎం కేసీఆర్​కు వివరించారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి కష్ట కాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని.. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సీఎం కేసీఆర్​కు మంత్రి, సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు విన్నవించుకున్నారు. 

ఈ సమీక్షా సమావేశంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, సైదిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్​ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, జెన్​కో అండ్ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
 
ఇదీ చదవండి: ప్రభుదేవా సంచలన నిర్ణయం.. డైరెక్షన్​కు గుడ్​బై!

Last Updated : Sep 21, 2021, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.