ETV Bharat / city

కరోనాపై ప్రతిరోజూ మూడుసార్లు సమీక్ష నిర్వహించాలి: సీఎం - telangana varthalu

cm kcr review on covid situation
కరోనాపై ప్రతిరోజూ మూడుసార్లు సమీక్ష నిర్వహించాలి: సీఎం
author img

By

Published : May 1, 2021, 3:16 PM IST

Updated : May 1, 2021, 3:49 PM IST

15:12 May 01

కరోనాపై ప్రతిరోజూ మూడుసార్లు సమీక్ష నిర్వహించాలి: సీఎం

   కరోనా చికిత్స, పడకలు, ఔషధాలు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల విషయంలో ఏ మాత్రం లోపం రానీయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను ఆదేశించారు. కొవిడ్  విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు సమీక్షించి స్వయంగా పర్యవేక్షించాలని నిర్దేశించారు. రెమిడెసివర్ వంటి ఔషధాలు, ఆక్సిజన్, పడకలు, వ్యాక్సిన్ల లభ్యత విషయంలో ఏ మాత్రం లోపం రానీయవద్దని స్పష్టం చేశారు. 
   
    అనుక్షణం కరోనా పర్యవేక్షణ చేయాలని సీఎంవోలో కార్యదర్శి ఉన్న రాజశేఖర్ రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి: మంత్రి ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ సీఎంకు బదిలీ

Last Updated : May 1, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.