ప్రగతిభవన్లో.. మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సాగు విధానం, పంటల కొనుగోళ్లు అంశంపై సమాలోచనలు చేస్తున్నారు.
'సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వరి పెద్ద మొత్తంలో సాగవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల నేపథ్యంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు సాధ్యం కాదని' అధికారులు, నిపుణులు.. ఇప్పటికే ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ ఏడాది అమలు చేసిన నియంత్రిత సాగు విధానం కూడా అవసరం లేదని, రైతులకు నచ్చిన పంట వేసుకోవడమే మేలన్నారు. వీటన్నింటి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
ఇవీచూడండి: బాలికల అభ్యున్నతితోనే దేశ ప్రగతి: గవర్నర్ తమిళిసై