సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందికి రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటి పారుదల శాఖను పునర్‌వ్యవస్థీకరించుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ(ఓ అండ్ ఎం) మాన్యువల్ రూపొందించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి, కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
నీటి పారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలి. ఈ వానాకాలంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో పై నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్ఆర్ఎస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి. కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి.
-సీఎం కేసీఆర్