ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమయిన సమావేశం రోజంతా కొనసాగనుంది. గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో నీరు ఎప్పుడు ఎంత విడుదల చేయాలి..? ఎస్ఆర్ఎస్పీ, ఎల్ఎండీలకు నీళ్లు ఎప్పుడు ఎంత తరలించాలి..? మిగతా రిజర్వాయర్లకు ఎప్పుడు తరలించాలి...? నీటిని ఎలా వాడుకోవాలి...? తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరుగుతుంది.
ఈ సమావేశంలో గోదావరి నది పరివాహక జిల్లాల మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, జగదీష్ రెడ్డి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ హాజరయ్యారు.