రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, ఆదేశాలు, ప్రకటనలు ఇక నుంచి తెలుగులోనూ రానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు. ప్రజలకు సమాచారం సౌలభ్యంగా ఉండేలా అధికారులు వ్యవహరించాలని సూచించారు. ఉత్తర్వులు, ఆదేశాలు, ప్రకటనలన్నీ కూడా తెలుగు, ఆంగ్లం భాషల్లో విడుదల చేయాలని తెలిపారు.
ఇదీ చూడండి: కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు రక్షణ: సీఎం