ETV Bharat / city

'కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గుడ్​ప్రైడే ప్రార్థనలు జరుపుకోండి'

మానవాళికి క్రీస్తు ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్​ఫ్రైడే సందర్భంగా అందరూ పున:శ్చరణ చేసుకోవాలని గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచించారు. కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గుడ్​ప్రైడే ప్రార్థనలు జరుపుకోవాలని క్రైస్తవులకు సూచించారు.

cm kcr on good friday festival
cm kcr on good friday festival
author img

By

Published : Apr 1, 2021, 7:51 PM IST

ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజుకు జ్ఞాపకార్థం క్రైస్తవ సోదరులు పాటించే గుడ్​ఫ్రైడేను పురస్కరించుకుని... జీసస్ బోధనల్లోని మానవీయతత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్​రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. మానవాళికి క్రీస్తు ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్​ఫ్రైడే సందర్భంగా అందరూ పున:శ్చరణ చేసుకోవాలని కోరారు.

క్రైస్తవులు ఎంతో పవిత్రంగా, ఆరాద్యమైన దినంగా భావించే రోజు గుడ్ ఫ్రైడే అని పేర్కొన్నారు. మానవాళి పట్ల ఏసుకున్న ప్రేమ, త్యాగనిరతిని గుడ్ ఫ్రైడే చాటిందని గవర్నర్ పేర్కొన్నారు. కరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం... సమస్త మానవాళి అనుసరించదగ్గవని కేసీఆర్ అన్నారు. కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గుడ్​ప్రైడే ప్రార్థనలు జరుపుకోవాలని క్రైస్తవులకు గవర్నర్​, ముఖ్యమంత్రి సూచించారు.

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన 27 మందికి కరోనా‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.