ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం... గవర్నర్ దంపతులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి ప్రారంభంకానున్న పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం గురించి వివరించారు. మొదటి విడత పురోగతి, ప్లైయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు తదితర అంశాలపై తమిళిసైకు తెలియజేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోత తదుపరి పనులపై చర్చించారు. వీటితోపాటు ఇతర తాజా పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా గవర్నర్‌ను కలిశారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్