హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంఛార్జీలను నియమించారు. పలువురు మంత్రులతో ప్రగతిభవన్లో సమావేశమైన సీఎం కేసీఆర్... ఎమ్మెల్సీ ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. సురభి వాణీదేవి రాజకీయాలకు కొత్త కావడంతో మూడు ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీలను నియమించారు. రంగారెడ్డి జిల్లా బాధ్యతలను మంత్రి హరీశ్ రావుకు, మహబూబ్నగర్ జిల్లా బాధ్యతలను మంత్రి ప్రశాంత్ రెడ్డికి అప్పగించారు.
హైదరాబాద్ జిల్లాకు మంత్రి గంగుల కమలాకర్ను ఇంఛార్జీగా నియమించారు. ఆయా జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను సమన్వయం చేసుకొని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తక్కువ సమయం ఉన్నందున అభ్యర్థి వాణీదేవి అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేసే అవకాశం లేదని... అందరూ భుజాన వేసుకొని పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : '12 కోట్ల ఉద్యోగాల వివరాల కోసం వేచిచూస్తున్నా'