ETV Bharat / city

ఉక్రెయిన్​ నుంచి వచ్చిన విద్యార్థులకు సీఎం కేసీఆర్​ గుడ్​న్యూస్​.. - assembly sessions

CM KCR Statements: ఉక్రెయిన్​ నుంచి తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు సీఎం కేసీఆర్​ శుభవార్త వినిపించారు. వారి చదువులు మధ్యలోనే ఆగిపోకుండా.. చదివించుకుంటామన్నారు. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.

CM KCR good news for students from Ukraine and announced in assembly

author img

By

Published : Mar 15, 2022, 6:47 PM IST

ఉక్రెయిన్​ నుంచి వచ్చిన విద్యార్థులకు సీఎం కేసీఆర్​ గుడ్​న్యూస్​..

CM KCR Statements: ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా.. కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చిన విద్యార్థుల భవిష్యత్‌పై.. కేంద్రానికి సరైన ప్రణాళిక లేదని సీఎం విమర్శించారు. అక్కడి నుంచి 710 మందికి రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నామన్న సీఎం.. వాళ్ల భవిష్యత్​ దెబ్బతినకుండా చదివించుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు.. ఆరోగ్యశాఖ మంత్రి, సీఎస్​ను.. కేంద్రానికి లేఖ రాయాలని ఆదేశించారు.

"దేశంలో వైద్య విద్య చాలా ఖరీదుగా మారింది. ఇక్కడ కోటీ రూపాయల వరకు ఖర్చయితే.. ఉక్రెయిన్​లో 25 లక్షల్లోనే వైద్య విద్య పూర్తవుతుంది. అందుకే చాలా మంది అక్కడికి వెళ్లి చదువుకుంటున్నారు. అక్కడికి ఎందుకు వెళ్లారంటే.. ఇక్కడ అవకాశాలు లేవని అక్కడికి వెళ్లారు. ఇప్పటికీ అక్కడ యుద్ధం ముగిసిపోలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. అతికష్టం మీద మొత్తానికి 710 మంది విద్యార్థులను టికెట్ల ధరలు భరించి తిగిరి రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నాం. కానీ.. ఇప్పుడు వాళ్ల భవిష్యత్​ ఏంటీ..? వాళ్ల చదువు మధ్యలోనే ఆగిపోవాలా..? మళ్లీ ఉక్రెయిన్​ వెళ్లే పరిస్థితి ఉందా..? ఏం జరగాలి..? తెలంగాణ ప్రభుత్వంగా.. నేను ప్రకటిస్తున్నా. కేంద్ర ప్రభుత్వానికి కూడా వెంటనే లేఖ కూడా రాస్తాం. వాళ్ల చదువులకు ఎంత ఖర్చయినా మేం భరించి.. ఇక్కడ చదివిస్తాం. వాళ్ల చదువు ఆగిపోకుండా.. భవిష్యత్​ దెబ్బతినకుండా.. చదివిస్తాం. ఆరోగ్యశాఖ మంత్రి, సీఎస్​.. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. దీని మీద కూడా కేంద్ర మంత్రులు రకరకాల నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేశారు. బెంగళూరుకు చెందిన నవీన్​ అనే విద్యార్థి చనిపోతే.. వాళ్ల తల్లిదండ్రులు బాధలో ఉండే ఇంకా బాధపెట్టే మాటలు మాట్లాడారు." - సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.