ETV Bharat / city

అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న కమలనాథులు: కేసీఆర్​ - జీఎస్టీపై కేసీఆర్​ ఆగ్రహం

జీఎస్టీ వల్ల రాష్ట్రానికి వచ్చిన లాభమేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీ వ్యాఖ్యానించారు. 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చిన అవకాశాన్ని భాజపా తీవ్రంగా అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.

cm kcr fire on bjp and congress in assembly
కాంగ్రెస్ మీద విసుగుతోనే భాజపాకు అధికారం: కేసీఆర్​
author img

By

Published : Mar 12, 2020, 4:35 PM IST

Updated : Mar 12, 2020, 4:46 PM IST

కాంగ్రెస్ పాలన మీద విసుగుతో ప్రజలు భాజపాకు అవకాశం కల్పించారని ముఖ్యమంత్రి కేసీఆర్​ అభిప్రాయపడ్డారు. అధికారం కోసం భాజపా 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిందన్నారు. ఇన్నేళ్లకు వచ్చిన అవకాశాన్ని కమలనాథులు తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైందనే సాకుతో జీఎస్టీని అమలు చేశారు. పన్నులు వసూలు చేసే బాధ్యత కేంద్రానికి ఇచ్చారు. వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వటం.. కేంద్రం దయాదాక్షిణ్యాలు కాదని ముఖ్యమంత్రి తీవ్రంగా దుయ్యబట్టారు. జీఎస్టీ అమలైన తర్వాత రాష్ట్రానికి ఏ సంవత్సరంలోనూ 10 వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఒకప్పుడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రమే పూర్తిగా నిధులు ఇచ్చేదని, ఇప్పుడు రాష్ట్రాలపై కూడా భారం వేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ మీద విసుగుతోనే భాజపాకు అధికారం: కేసీఆర్​

ఇదీ చూడండి: అసెంబ్లీలో భట్టి చెప్పిన నిజం.. అందరినీ ఆలోచింపజేసింది!

Last Updated : Mar 12, 2020, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.