సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 48వ సీజేఐగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్... జస్టిస్ రమణ విశేష అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం అవుతుందని అన్నారు.
ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీకాలం గొప్పగా సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణకు అభినందనతో లేఖ పంపారు.
- ఇదీ చదవండి : సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం