ETV Bharat / city

kcr congratulates nikhat zareen: నిఖత్ జరీన్​కు కేసీఆర్ అభినందనలు.. - తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్​కు స్వర్ణ పతకం

kcr congratulates nikhat zareen: కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్ జరీన్ పసిడి పంచ్​కు ప్రశంసల వర్షం కురుస్తోంది. పతకం గెలవగానే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర కీర్తి మరోసారి విశ్వవాప్తం చేశావని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

cm kcr
cm kcr
author img

By

Published : Aug 7, 2022, 8:24 PM IST

kcr congratulates nikhat zareen: బర్మింగ్ హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో, ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జరీన్​తో స్వయంగా ఫోన్​లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయపరంపరను అభినందించారు. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే వుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

nikhat zareen wins gold: కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ జరీన్ 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో పోటీ చేసింది. ఫైనల్​లో నార్తరన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. బౌట్లో ఆరంభం నుంచే శివంగిలా విరుచుకుపడిన నిఖత్‌.. తన పవర్‌ పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లోనూ నిఖత్‌ అద్భుతమైన ప్రదర్శనతో బంగారు పతకం నెగ్గి తెలంగాణ కీర్తిని పెంచింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.