ETV Bharat / city

తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

పల్లె, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల మార్పు లక్ష్యంగా పనిచేయాలన్న సీఎం... పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణం కోసం అవసరమైతే మున్సిపల్ నిధులతో స్థలాలు కొనుగోలు చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, చెరువుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

cm kcr on palle pattana pragathi
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్
author img

By

Published : Jan 12, 2021, 5:24 AM IST

పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతంగా అమలవుతూ తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయని అన్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేవలం 84 గ్రామపంచాయతీలకు మాత్రమే సొంతగా ట్రాక్టర్లు ఉండేవన్న సీఎం... ఇపుడు మొత్తం 12,765 గ్రామపంచాయతీలకు గాను 12,681 గ్రామాల్లో ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు సమకూరాయని చెప్పారు. తెలంగాణ పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తోందని... పచ్చదనం – పరిశుభ్రత విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో 91శాతం బతికాయన్న ముఖ్యమంత్రి... 19,470 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు లక్ష్యానికి గాను 19,027 చోట్ల స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. 15,646 చోట్ల మొక్కలు కూడా నాటడం పూర్తయిందని, మిగతా చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 2,601 చోట్ల రైతు వేదికలు నిర్మాణం ప్రారంభం కాగా, ఇప్పటికే 2580 చోట్ల నిర్మాణం పూర్తయిందని సీఎం చెప్పారు.

పర్యవేక్షణ పక్కాగా ఉండాలి..!

రాష్ట్రవ్యాప్తంగా 12,736 గ్రామాల్లో నిర్మాణమవుతోన్న డంపింగ్ యార్డుల పనులు 91శాతం పనులు పూర్తయ్యాయని... 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారవుతోందని చెప్పారు. 12,742 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైందని అన్నారు. పంచాయతీలకు ప్రతినెలా రూ. 308 కోట్ల చొప్పున ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధం లేకుండా సాగుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నిరకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శక పద్ధతులు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదని, గ్రామాల్లో పెరిగిన పరిశుభ్రత వల్ల ఈసారి డెంగ్యూ వ్యాధి రాకపోవడాన్ని గమనించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నేలవిడిచి సాము చేయకుండా గ్రామాలే కార్యవేదికగా గుర్తించాలని, గ్రామాలను గొప్పగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ మార్గనిర్ధేశం చేశారు. అదనపు కలెక్టర్లు, డీపీఓలు తరచూ గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించాలని... మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించినప్పుడు పల్లె ప్రగతి పనులను ఖచ్చితంగా సమీక్షించాలని చెప్పారు. ఎంపీఓలు నిత్యం అన్ని గ్రామాల్లో పర్యటించాలని సీఎం ఆదేశించారు.

ప్రశంసలు..

పల్లెప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా అద్భుతంగా పనులు సాగేలా కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను పర్యవేక్షిస్తున్నారని... సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు ఎంతో శ్రమకోర్చి పనులు చేస్తున్నారని సీఎం కేసీఆర్ అభినందించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వందశాతం నెరవేర్చిన సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావును ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా వైకుంఠధామాలు పూర్తి చేయాలని కోరారు.

పచ్చగా పట్టణాలు..!

పట్టణప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయని... అన్ని మున్సిపాలిటీల్లో పచ్చదనం – పరిశుభ్రత పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో, వాయుకాలుష్యంలో జీవించడం మంచిది కాదని... పరిశుభ్రత, పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నట్లు చెప్పారు. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న 2,802 పారిశుధ్య వాహనాలకు అదనంగా మరో 2,004 వాహనాలను సమకూరుస్తున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. అన్ని పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వైకుంఠధామాలను నిర్మించాలన్న కేసీఆర్... ఇందుకోసం అవసరమైతే మున్సిపాలిటీల నిధులతో స్థలాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 116 పట్టణాల్లో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని... ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో అదనపు మార్కెట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ఈమారు బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని... ఇందుకోసం ప్రభుత్వ, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలని ఆదేశించారు.

హరితహారం భేష్..

హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హరితహారంతో రాష్ట్రంలో మూడేళ్ళలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు తెలిపారు. సామాజిక అడవుల పెంపకంతో పాటు అటవీ ప్రాంతాల్లో అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. కలప అక్రమరవాణాను పూర్తిగా అరికట్టాలని, స్మగ్లర్ల పై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అభివృద్ధి అవుతోన్న 90 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులతో పాటు పట్టణ ప్రాంతాల సమీపంలోని అటవీ ప్రాంతాలను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచుతున్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి, అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. 127 శాతం మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్న సీఎం కేసీఆర్... జిల్లా కలెక్టర్ శరత్ ను ప్రశంసించారు. కోటీ ఆరు లక్షల మొక్కలు నాటి రాష్ట్రంలో అత్యధిక మొక్కలు నాటిన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం నిలిచిందని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డిని అభినందించారు.

మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మిగిలిపోయిన 28వేల మంది లబ్దిదారులకు వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రానున్న బడ్జెట్ లో నిధులు కేటాయించి రెండో దఫా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లోనూ చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరువుల రక్షణ కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల రక్షణ కమిటీలను నియమించాలని చెప్పారు.

ఇదీ చూడండి: అన్ని శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.