ETV Bharat / city

నీతి ఆయోగ్​ భేటీ... రాష్ట్ర విజయాలు ప్రస్తావించనున్న కేసీఆర్​ - కేసీఆర్ వార్తలు

ప్రధాని మోదీ అధ్యక్షతన నీతిఆయోగ్ పాలకమండలి సమావేశమైంది. వర్చువల్ విధానంలో జరగుతున్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేంద్రం నుంచి అందాల్సిన తోడ్పాటును సీఎం ప్రస్తావించనున్నారు. తెలంగాణ విజయాలను వివరించనున్నారు.

kcr
kcr
author img

By

Published : Feb 20, 2021, 10:54 AM IST

ప్రధాని మోదీ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో... కాసేపట్లో నీతిఆయోగ్ ఆరో పాలకమండలి భేటీ అయింది. వ్యవసాయం, మౌలిక వసతులు, తయారీ రంగం, మానవవనరుల అభివృద్ధి, కిందిస్థాయిలో సేవలు, వైద్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై సమావేశంలో.. విస్తృతంగా చర్చించనున్నారు. ప్రత్యేకించి కొవిడ్, తదనంతర పరిణామాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టిసారిస్తారు. ఈ సమావేశంలో... రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది.

రాష్ట్ర విజయాలను వివరించనున్న సీఎం

వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలు తెలుపుతూ సంక్షిప్త నివేదికలు సిద్ధంచేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, విధానాలతో... నివేదికలను రూపొందించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలైన... టీఎస్​- ఐపాస్​, కేసీఆర్​ కిట్‌, రైతు బీమా, రైతుబంధు తదితర పథకాల తీరుతెన్నులు పొందుపర్చారు. ఆయారంగాల్లో రాష్ట్ర విజయాలతో పాటు నీతిఆయోగ్ ఇచ్చిన ర్యాంకుల వివరాలను సిద్ధంచేశారు.

భవిష్యత్​ ప్రణాళికల ప్రస్తావన...

కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే సాధించిన విజయాలను నీతిఆయోగ్ సమావేశంలో వివరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్... భవిష్యత్ ప్రణాళికలను ప్రస్తావించే అవకాశం ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు, తయారీ రంగం, వైద్యరంగం, మౌలికవసతుల సంబంధిత అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారని అంటున్నారు. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన సహకారం, మద్దతు అంశాలను నీతిఆయోగ్ సమావేశంలో కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. కరోనా తర్వాత రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా పడిపోవడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న పరిస్థితుల్లో... కేంద్రం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావిస్తారని చెబుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి నీతిఆయోగ్ గతంలో చేసిన సిఫారసుల అమలును సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : డేటింగ్ యాప్స్​తో హనీ ట్రాప్స్.. యూత్ ప్లీజ్ బీ కేర్​ఫుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.