ETV Bharat / city

'పథకాలు అందితేనే ఆశీర్వదించండి.. మీ భవితకు బాధ్యత నాది' - సీఎం జగన్ తాజా వార్తలు

ఏపీలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమవండని పిలుపునిచ్చారు వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్. వైకాపా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అని పేర్కొన్నారు. పథకాలు అందితేనే ఆశీర్వదించండి అని ప్రజలతో చెప్పగలిగేంత నిబద్ధత పార్టీకి ఉందన్నారు.

jagan
jagan
author img

By

Published : Jul 10, 2022, 11:52 AM IST

ఆంధ్రప్రదేశ్​లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను, సామాజిక న్యాయాన్ని కొనసాగించుకునేందుకు మరిన్ని అడుగులు ముందుకు పడాలంటే.. మనను వ్యతిరేకిస్తున్నవారి నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించారు. సంక్షేమ పథకాల ఫలాలను అందుకుంటున్న ప్రతి కుటుంబానికీ తమను మళ్లీ గెలిపించే బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలు అందితేనే, జగనన్న మ్యానిఫెస్టోలో చెప్పింది చేశాడన్న నమ్మకం కలిగితేనే వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండని ప్రజలకు చెప్పేంత నిబద్ధతా తమకుందని పేర్కొన్నారు. వైకాపా ప్లీనరీలో పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక శనివారం ముగింపు ప్రసంగం చేశారు.

"మూడేళ్లలో ఏపీని గాడిలో పెట్టేందుకు, ఉజ్వల భవిష్యత్తును నిర్మించేందుకు పూర్తి దృష్టి పెట్టానంటే కారణం క్షేత్ర స్థాయిలో మీరున్నారనే ధైర్యమే. అదే నన్ను ఇలా నడిపించింది. ఈ పార్టీ మీది.. జగన్‌ మీవాడు. మీ భవితకు, ఏపీ భవిష్యత్తుకూ నాదీ బాధ్యత. మీ కష్టసుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నా."

- కార్యకర్తలతో జగన్‌

"175 స్థానాలు అసాధ్యం కాదు మొన్న 151 స్థానాలు గెలిచాం. 2024 ఎన్నికల్లో 175కి 175 స్థానాలతో తిరిగివస్తాం. విమర్శలకు బెదరం. వెనకడుగు వేయం.. మన అడుగు ముందుకే అని చెప్పండి. 175 స్థానాలు గెలవడమే లక్ష్యమని ముందుకు కదలండి. ఇది అసాధ్యం కాదు.. సుసాధ్యమే. తెదేపా అసత్య ప్రచారం.. దుష్టచతుష్టయం పన్నాగాలను సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టండి. ప్రతి గ్రామంలో సోషల్‌ మీడియా సైన్యాన్ని తయారు చేయండి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దుష్ట చతుష్టయం ఇంకా అసత్య ప్రచారం పెంచుతారు. నా గుండె ధైర్యం మీరే. ఈ కౌరవ సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదే. మీతోపాటు ప్రతి గ్రామంలో మన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుకుంటున్న 80 శాతం కుటుంబాలే మన సైనికులు. మీ అందరి భుజస్కంధాలపై ఈ బృహత్తర బాధ్యతను మోపుతున్నా. మనకున్నది నిజాయతీ, మాటకు ప్రాణమిచ్చే గుణం, నిబద్ధత, ప్రజలకు మేలు చేయాలనే తపన." అని సీఎం జగన్​ పేర్కొన్నారు.

ఇంటింటికీ వెళ్లి ఇదే చెప్పండి.. గతంలో చంద్రబాబు పాలనలో 650 హామీలిచ్చి 10 శాతమైనా అమలు చేయలేదు. తర్వాత వారి మ్యానిఫెస్టోను మాయం చేసిన అధ్వాన స్థితి. మనం అధికారంలోకొచ్చిన మూడేళ్లలోనే మ్యానిఫెస్టోలోని హామీల్లో 95 శాతం అమలు చేశాం. 'గడప గడపకూ మన ప్రభుత్వం'లో మన ప్రజాప్రతినిధులు అదే మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకువెళ్లి చూపించి ఇవి చేశామా లేదా అని ప్రతి ఒక్కరినీ అడుగుతున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకు అందించేందుకు నిబద్ధతతో పని చేస్తున్న మనకు, తెదేపాకూ తేడా గమనించాలని కోరుతున్నా.

చంద్రబాబువి పగటి కలలు.. అధికారంలోకి వస్తామని చంద్రబాబు, ఆయన మనుషులు పగటి కలలు కంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలను ఎత్తేసే స్కెచ్‌లు వేస్తున్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అమెరికాలాగా ఉందా? బాబుకు ఎవరైనా పొరపాటున ఓటేస్తే దాని అర్థం ఈ సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే అన్న సంగతిని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లండి. ఈ మధ్య చంద్రబాబు తన వేలికి ఒక ఉంగరం చూపించి దానిలో చిప్‌ ఉందని చెబుతున్నారు. చంద్రబాబులాగా వేలికో, మోకాల్లోనో, అరికాల్లోనో చిప్‌ ఉండటం కాదు. అది మెదడులో, గుండెలో ఉంటేనే ప్రజలకు మంచి చేయాలని, వాళ్ల జీవితాలు బాగు చేయాలనే ఆలోచన వస్తుంది.

.

దానిపై ఫోకస్‌ పెట్టలేదు.. 2014-19 మధ్య వైకాపాను నిర్వీర్యం చేయాలని, జగన్‌ కనపడకుండా పోవాలని చంద్రబాబు కుతంత్రాలు చేశారు. మన ఎమ్మెల్యేలు 23 మందిని, ముగ్గురు ఎంపీలను కొనేశారు. కానీ ఈ మూడేళ్ల మన ప్రభుత్వ పాలనలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, ప్రజలకు ఎలా మంచి చేయగలం, ఎంత మంచి పాలన అందించగలమనే దానిపైనే నేను దృష్టి కేంద్రీకరించా. అంతే తప్ప తెదేపా ఎమ్మెల్యేలను కొని, ఆ పార్టీని నిర్వీర్యం చేయాలనే విషయంపై ఫోకస్‌ పెట్టలేదు.

ఇది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం.. ఏపీలో రెండు సిద్ధాంతాలు, రెండు భావాల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలకు న్యాయం చేయాలని, అండగా నిలవాలని మనం.. ఆ వర్గాలకు న్యాయం చేయడానికి వీల్లేదని తెదేపా, దానికి తోడు దుష్టచతుష్టయం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ ఏర్పాటును అడ్డుకునే కుట్ర చేశారు. చంద్రబాబు హయాంలో నారాయణ, చైతన్య సంస్థల బాగు కోసం శ్రమిస్తే.. మనం ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లి, పేద పిల్లలు అత్యున్నత స్థాయిలో చదువుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఈ మూడేళ్లలో విద్యారంగంలోనే 9 పథకాలను అమలు చేశాం.

రైతులకు చెప్పినట్లే చేశాం.. రైతులకు రూ.87 వేల కోట్లు, డ్వాక్రా మహిళలకు రూ.14,500 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు వారిని మోసగించారు. మనం చెప్పినట్లుగానే.. రైతు భరోసా- పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటికే రైతుల కోసం రూ.23,875 కోట్లు ఖర్చు పెట్టాం. వ్యవసాయ రంగంపై ఈ మూడేళ్లలో రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతు పక్షపాత ప్రభుత్వం మనదని సగర్వంగా చెబుతున్నా.

ఇళ్లు తగలబెట్టించారు.. 'గత 74 సంవత్సరాల్లో ఏపీలో కేవలం 2 జిల్లాలే కొత్తగా ఏర్పడ్డాయి. మన ప్రభుత్వం వచ్చాక 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏకంగా 26 జిల్లాలయ్యాయి. అందులో ఒక జిల్లాకు మన రాజ్యాంగ నిర్మాత, దళిత శిఖరం అంబేడ్కర్‌ పేరు పెట్టినందుకు.. ఒక ఎస్సీ మంత్రి ఇంటిని, బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగులబెట్టించిన దుర్మార్గం ఎవరిది? ఈ పెద్దమనిషి చంద్రబాబుది. ఆయన దత్తపుత్రుడిది. ఓదార్పు యాత్ర చేయకపోతే నాపై కేసులే ఉండేవి కావు. కానీ, జగన్‌ అలాంటి బెదిరింపులకు లొంగే వ్యక్తే అయితే ఈ రోజు మీ ముందు ఇలా ఉండేవాడు కాదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీతో ప్రారంభమైన మనం ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ సభ్యులకు చేరుకున్నాం. నాడు అన్యాయంగా నన్ను అరెస్టు చేయించిన పార్టీ ఏపీలో నామరూపాల్లేకుండా పోయిందంటే దేవుడు, మీ అందరి అండదండలతోనే అది సాధ్యమైంది' అని జగన్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.