JAGANNANNA PALAVELLUVA: జగనన్న పాలవెల్లువ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చవల్‌గా ప్రారంభించారు. కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో పాలవెల్లువ కొనసాగనుందని సీఎం వెల్లడించారు. ఏపీ పాలవెల్లువ ద్వారా రైతులకు మెరుగైన ధర లభిస్తుందన్న జగన్.. అమూల్ ఒక కంపెనీ కాదని, పాలు పోసేవాళ్లే యాజమానులని స్పష్టం చేశారు.
అమూల్ సంస్థ ఏపీలో ఇప్పటికే పాల సేకరణ చేస్తోందని.. ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాలసేకరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పాలవెల్లువ ఇవాళ ఆరో జిల్లా కృష్ణాలోకి ప్రవేశిస్తోందన్న ముఖ్యమంత్రి.. మహిళ సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పాల నుంచి చాక్లెట్ తయారు చేసే వ్యవస్థ అమూల్‌కు ఉందని.. ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఈ సంస్థ ఉన్నట్లు చెప్పారు. లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప సంస్థ అమూల్.. అని సీఎం వివరించారు.
ఇదీ చదవండి: Governor Tamilisai on Vaccination: టీకా ఒక్క డోసు తీసుకోవడంతో ఉపయోగంలేదు : గవర్నర్ తమిళిసై