ETV Bharat / city

Ap CM Jagan: జగన్ దిల్లీ టూర్.. ఎవరెవరిని కలిశారంటే..

ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల దిల్లీ పర్యటన బిజీబిజీగా సాగింది. మొదటిరోజు కేంద్ర హోంమంత్రి అమిత్​షా, ప్రకాశ్ జావడేకర్, గజేంద్రసింగ్ షెకావత్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్​​ను కలిశారు. ఇవాళ కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్రప్రధాన్​ను కలిసి పలు కీలకాంశాలపై చర్చించారు. విభజన హామీలు.. ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు సమస్యలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇలా చాలా అంశాలను సీఎం జగన్ కేంద్రం ముందుపెట్టారు. మరుగున పడిపోయిందనుకున్న ప్రత్యేక హోదా అంశాన్నీ తెరపైకి తెచ్చారు. అమిత్​షాతో భేటీ సందర్భంగా ప్రధానంగా మూడు రాజధానులు, ప్రత్యేక హోదాను ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

Ap CM Jagan
జగన్ దిల్లీ టూర్
author img

By

Published : Jun 11, 2021, 9:07 PM IST

పెద్ద చిట్టాతోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి దిల్లీకి బయలుదేరారు. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ గురువారం రాత్రి 9 గంటలకు సమావేశమయ్యారు. రాత్రి 10.35 నిమిషాల వరకు ఇద్దరి మధ్య పలు కీలకాంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారని.. వైకాపా నేతలు చెబుతున్నారు. 3 రాజధానులకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోరారని.. అందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించారని వివరిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీనోటిఫికేషన్ జారీ చేయాలని కోరగా అమిత్​షా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. కనుమరుగైన ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని.. విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా రాష్ట్రం సమస్యలను ఎదుర్కొంటోందని అమిత్​షాకు జగన్ వివరించినట్టు నేతలు చెబుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే.. అనేక రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా నడిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు అధికంగా వస్తాయని.. అప్పుడు ఆర్థిక భారం తగ్గుతుందని సీఎం జగన్ అమిత్​షా వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగ, ఉపాధి కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా అవసరమని.. ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు విన్నవించారు ముఖ్యమంత్రి. ఈ అంశాన్ని పరిశీలిద్దామని అమిత్​షా హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే అంతర్గంతంగా ఏం చర్చ జరిగిందనే విషయం పక్కనబెడితే.. సీబీఐ కేసులు, రఘురామ రాజు గొడవపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బెయిల్ రద్దు అవుతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యత చేకూరింది. అంతకుముందు కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్, గజేంద్రసింగ్ షెకావత్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్​​ను జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలు, ఇతర అంశాలపై చర్చించారు.

రెండోరోజు సాగిందిలా..

రెండోరోజు పర్యటనలో భాగంగా ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ విషయంలో తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్రమంత్రికి వివరించారు. కాకినాడ సెజ్​లో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారం లేకుండా చూడాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపిన ధర్మేంద్ర ప్రధాన్‌.. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలోనూ సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చేవారం ఏపీ సీఎస్‌, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. దాదాపు గంటకుపైగా ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం సమావేశం కొనసాగింది.

రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. కొవిడ్‌ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రికి వివరించారు. మరో రెండు నెలలపాటు ఉచిత బియ్యం పంపిణీని కేంద్రం పొడిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. 2015 డిసెంబర్‌ వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌ కార్డులకు 1,85,640 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయిస్తున్నట్లు జగన్‌ తెలిపారు.

2015 తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం కుటుంబాలకు, పట్టణాలు, నగరాల్లో 41.14 శాతం కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసి బియ్యం పంపిణీ చేస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు రేషన్‌ బియ్యాన్ని కేటాయిస్తున్న విధానం రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించిందని.. తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా కేటాయిస్తున్నారని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ కన్నా ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినవేనని.. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని జగన్‌ వివరించారు.

శ్రేణుల్లో జోష్!

ముఖ్యమంత్రి జగన్ పర్యటన వైకాపా నేతలు, శ్రేణుల్లో జోష్ నింపినట్టు కనిపిస్తోందనే విశ్లేషణలు జరుగుతున్నాయి. అటు పార్టీ క్యాడర్ కూడా జగన్ దిల్లీ పర్యటన విషయాలను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై ఫేస్​బుక్, ట్విట్టర్​లో జోరుగా చర్చ జరుగుతోంది. మరుగునపడిన విషయాన్ని సీఎం జగన్ మళ్లీ లేవనెత్తారనే పోస్టులు దర్శనమిస్తున్నాయి. 'ప్రత్యేక హోదా గురించి మనం మర్చిపోయినా... సీఎం జగన్ మర్చిపోరు' అని పోస్టులు పెడుతున్నారు. దీనికి అంతే దీటుగా.. ప్రతిపక్ష పార్టీల క్యాడర్ కౌంటర్ ఇస్తున్నారు.

ఇదీ చదవండి: KCR review: గ్రామ పంచాయతీలు, పురపాలికల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.