రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan speech in southern zonal council meeting news) అన్నారు. తిరుపతి వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ(southern zonal council meeting news)లో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రాల మధ్య సమస్యలపై ప్రత్యేక కమిటీ వేయాలని కోరారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఏడేళ్లు దాటినా విభజన హామీలు అమలు కాలేదని సమావేశంలో జగన్(cm jagan speech in southern zonal council meeting news) ప్రస్తావించారు. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్న ఆయన.. పోలవరం ఖర్చు నిర్ధరణలో 2013–14 ధరల సూచీతో ఏపీకి అన్యాయం జరుగుతోందని చెప్పారు. పోలవరం ఖర్చుపై విభజన చట్టాన్ని ఉల్లంఘించారని అన్నారు. ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేదని(special status for andhra pradesh news) వ్యాఖ్యానించారు.
''తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట ఇవ్వాలి. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు. ఈ అంశంపై దృష్టిసారించాలి. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోతలు విధిస్తున్నారు. ఈ అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లేదు. ఈ ప్రక్రియలో సవరణలు చేయాలి '' - దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్
రాత్రి 7 గంటలకు వరకు..
తిరుపతి వేదికగా దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం(southern zonal council meeting news) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది(Southern Zonal Council Meeting news). ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, అండమాన్ నికోబార్ ఎల్‌జీ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ సమావేశానికి హాజరయ్యారు. దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశం ఎజెండాలో మొత్తం 26 అంశాలను పొందుపరిచారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్యల నివేదికలు రెండింటితోపాటు 24 కొత్త అంశాల్ని చర్చకు చేపడతారు.
ఇదీ చదవండి: KTR letter to Piyush Goyal: 'సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు నిధులివ్వరా..?'