ETV Bharat / city

'ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి'... కేంద్ర మంత్రికి ఏపీ సీఎం లేఖ - కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ

యువతను పక్కదోవ పట్టిస్తున్న ఆన్​లైన్ జూదం, బెట్టింగ్ వెబ్​సైట్లు, యాప్​లను ఏపీలో బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు.

'ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి'... కేంద్ర మంత్రికి ఏపీ సీఎం లేఖ

author img

By

Published : Oct 29, 2020, 10:53 AM IST

ఆంధ్రప్రదేశ్​లో ఆన్​లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్​సైట్లు, యాప్​లను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​కు ముఖ్యమంత్రి జగన్ బుధవారం లేఖ రాశారు. ఏపీలో మొత్తం 132 వెబ్​సైట్లు ఆన్​లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్​కు కారణం అవుతున్నాయని సీఎం లేఖలో పేర్కొన్నారు. వీటి వినియోగాన్ని ఏపీలో నిలిపివేసేలా ఇంటర్ నెట్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించాలని కోరారు.

ఏపీ గేమింగ్ చట్టం 1974ను సవరించి ఏపీలో ఆన్​లైన్ గేమింగ్, బెట్టింగ్​లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రికి లేఖ ద్వారా సీఎం తెలిపారు. 2020 సెప్టెంబర్ 25న ఈ సవరణ ఆర్డినెన్స్​కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్టు వివరించారు. ఈ చట్టం మేరకు ఆన్​లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్​ నిర్వహించే వారు శిక్షార్హులని పేర్కొన్నారు.

ఈ వెబ్​సైట్లు, యాప్​లకు యువత బానిసలవుతున్నట్టు సీఎం లేఖలో పేర్కొన్నారు. చాలామంది తమ ఆస్తులను కూడా పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు, లాప్​టాప్​లు అందరికి అందుబాటులో ఉన్నందున సులువుగా ఇలాంటి ఆన్​లైన్ క్రీడలకు ఆకర్షితులై ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. ఏపీలో వీటి కార్యకలాపాలు నిరోధించేలా తక్షణం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని కేంద్ర మంత్రిని కోరారు.

ఇదీ చూడండి: తెలంగాణ పోలీసులకు స్కోచ్​ బంగారు పతకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.