ETV Bharat / city

వైద్యశాఖలో లోపాలు బయటకు వస్తాయనే: భట్టి - bhatti on health emergency

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నా.. సీఎం కేసీఆర్​ సమీక్షలు చేయకపోవడంపై సీఎల్పీ నేత భట్టి మండిపడ్డారు. వైద్యాశాఖలో లోపాలు, సిబ్బంది కొరత బయటకు వస్తుందనే సమీక్షలు చేయడం లేదా.. అని అనుమానం వ్యక్తం చేశారు.

Clp leader Bhatti vikramarka fires on cm kcr over corona control
వైద్యశాఖలో లోపాలు బయటకు వస్తాయనే: భట్టి
author img

By

Published : Aug 11, 2020, 6:17 PM IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కరోనాతో ప్రజలు మరణిస్తుంటే ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. వైద్యశాఖలో ఉన్న లోపాలు బయటకు వస్తాయన్న భయంతోనే సమీక్ష చేయడం లేదా.. అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఆలోచించాలని భట్టి విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేటు దవాఖానాల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్​ చికిత్సకు రుసుములు ఖరారుచేసి.. రాష్ట్రంలోని 17 లోక్​సభ నియోజకవర్గాలకు ఒక్కో ఐఏఎస్‌ అధికారిని ఇంఛార్జిగా నియమించాలని కోరారు.

వైద్యశాఖలో లోపాలు బయటకు వస్తాయనే: భట్టి

ఇవీచూడండి: రష్యా 'కరోనా వ్యాక్సిన్​' ఎంత సురక్షితం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.