ETV Bharat / city

ముఖ్యమంత్రిని ఆ వాహనంలోనే తీసుకెళ్తారా..? సీఎల్పీ నేత భట్టి - ప్రభుత్వంపై భట్టి విక్రమార్క మండిపాటు

కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. శానిటైజేషన్​ చేయకుండానే... విపక్ష నేతలను అరెస్టు చేసి స్టేషన్​కు తరలిస్తున్నారని ఆరోపించారు.

clp leader bhatti vikramarka fire on kcr government
ముఖ్యమంత్రిని ఆ వాహనాల్లోనే తీసుకెళ్తారా..?: భట్టి
author img

By

Published : Jul 27, 2020, 2:39 PM IST

ప్రశ్నించేవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు యంత్రాంగంతో అరెస్టులు చేయిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్‌ పెద్ద రాజకీయ కుట్రదారుడని... ఏ స్థాయికైనా దిగజారుతారని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారికి కరోనా రావాలని శపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ భట్టి విరుచుకుపడ్డారు. పోలీసు స్టేషన్‌, పోలీసు వాహనాల్లో శానీటైజ్ చేయకుండానే విపక్ష నేతలను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రిని ఎక్కడికైనా తీసుకెళ్లాల్సి వస్తే ఆ వాహనాల్లోనే తీసుకెళ్తారా అని పోలీసులను ప్రశ్నించారు. అరెస్టు చేసే ముందు వాహనాలను, స్టేషన్​ను శుభ్రపరిచి తీసుకువెళ్లాలని కోరారు. పోలీసు వాహనాల ద్వారా తమ నేతలకు ఎవరికైనా కరోనా సోకితే సీఎం కేసీఆర్, డీజీపీలు బాధ్యత వహించాలన్నారు. అవసరమైతే కేసులు వేసేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. పోలీసులు తీసుకెళ్లే వాహనాల్లో కార్యకర్తలు గుడ్డిగా ఎక్కవద్దని సూచించారు.

ముఖ్యమంత్రిని ఆ వాహనాల్లోనే తీసుకెళ్తారా..?: భట్టి

ఇదీ చూడండి: రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.