రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళ తీసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శాంత్రి భద్రతలు క్షీణించాయని.. మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు. ప్రభుత్వ అసమర్థతతో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని భట్టి విమర్శించారు. కేసీఆర్ వైఖరితో ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలు చేసుకున్నారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా.. ఎన్నికల హామీలు అమలులో విఫలమయ్యారని ఆరోపించారు. ఉద్యోగాలు కల్పించలేదని.. నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. పోడు భూములు లాక్కొని గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వ్యయాన్ని పెంచారన్నారు. రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు తేలిందని భట్టి తెలిపారు.
ఇవీచూడండి: "కష్టపడి పనిచేయండి.. తెలంగాణలో గెలుపు మనదే"