రైతుల ఉద్యమానికి సంఘీభావంగా... రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసినందుకు నిరసనగా ఈ నెల 9న దీక్ష చేపట్టనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న నిరంతర పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వివరించారు.
దిల్లీలో లక్షలాది మంది రైతులు రోజుల తరబడి ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ఉద్యమిస్తున్నారని భట్టి తెలిపారు. 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గాంధీ భవన్లో దీక్ష చేయనున్నట్లు తెలిపారు