జీహెచ్ఎంసీ పోలింగ్ వేళ నాచారం 6 వ డివిజన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస అభ్యర్థి ఇంటి వద్ద కాంగ్రెస్, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ వర్గీయులు తమ పార్టీ అభ్యర్థి ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ... తెరాస నేతలు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్య మాటా మాటా పెరిగి... గొడవకు దారి తీసింది. పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి భర్త మేడల మల్లికార్జున్ వల్ల తనకు ప్రాణహాని ఉందని తెరాస అభ్యర్థి శాంతి సాయి జెన్ శేఖర్ ఆరోపించారు.