ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏడు పేపర్ల ద్వారా నిర్వహించనున్నారు. ఏటా 11 పేపర్లతో నిర్వహించే పరీక్షలను ఈసారి కొవిడ్-19 నేపథ్యంలో ఏడింటికి పరిమితం చేశారు. ప్రతి పరీక్షకు రెండున్నర గంటల సమయం కేటాయిస్తూ పాఠశాల విద్యా శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది జరిగే పబ్లిక్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. సామాన్య శాస్త్రం మినహా మిగిలిన పరీక్షల్లో ఆబ్జెక్టివ్, సంక్షిప్త, క్లుప్త, వ్యాస రూపంలో ఇచ్చే 33 సమాధానాలకు వంద మార్కులు కేటాయించారు. సామాన్య శాస్త్రంలో 2 పేపర్లతో 50 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. జూన్ 7 నుంచి పరీక్షలు జరగనున్నాయి.