CJI Justice NV Ramana On AP Tour: ఏపీ పర్యటన ముగించుకొని దిల్లీకి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. సంతోషం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, జడ్జిల పట్ల తెలుగువాళ్లు చూపిన గౌరవం మరిచిపోలేనన్నారు. విందు ఇచ్చిన ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
తనను సత్కరించిన బార్ అసోసియేషన్, హైకోర్టు ఉద్యోగులకు సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం వేచిచూసి, దీవించిన అందరికీ నమస్సులు తెలిపారు. తెలుగు ప్రజల అభిమానం, నమ్మకాన్ని వమ్ముచేయబోనని హామీ ఇస్తున్నానన్నారు. తన పర్యటన సాఫీగా జరిగేందుకు కృషిచేసిన అందరికీ సీజేఐ ధన్యవాదాలు తెలిపారు.
"స్వగ్రామం వెళ్లి మా వాళ్లను పలకరించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కోర్టుకు శీతాకాలం సెలవులు ఇవ్వడం వల్ల నాకు అవకాశం దొరికింది. రాష్ట్ర సరిహద్దుల్లోనే ప్రజలు నాకు ఘనస్వాగతం పలికారు. పొన్నవరం వాసులు ఎడ్లబండిపై తీసుకెళ్లటం నన్ను కదిలించింది. పొన్నవరం వీధుల్లో నడుస్తుంటే.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అల్లుళ్లు, మనుమరాళ్లకు తొలిసారి మా ఊరు చూపించి సంతృప్తి చెందా. మూలాలు మరిచిపోవద్దు అనేదాన్ని నేను బలంగా నమ్ముతా. విందు ఇచ్చిన సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌కు ధన్యవాదాలు. అందిన ఆతిథ్య ఆహ్వానాల్లో కొన్నింటినే ఆమోదించగలిగాను."
-సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఇవీ చూడండి: