ETV Bharat / city

విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్: దత్తాత్రేయ

తగు జాగ్రత్తలు తీసుకొని కరోనాను జయించవచ్చని హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఎల్బీ నగర్​ పరిధిలోని చిత్ర లే అవుట్​ వెల్ఫేర్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు పౌర సన్మానం నిర్వహించారు.

civic felicitation to himachalapradesh governor bandaru dathathreya in lb nagar chithra layout
విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్: దత్తాత్రేయ
author img

By

Published : Dec 30, 2020, 7:35 AM IST

స్వచ్ఛ హైదరాబాద్​కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ పరిధిలోని చిత్ర లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... దత్తాత్రేయకు పౌర సన్మానం నిర్వహించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించినట్టేనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కరోనా వ్యాక్సని తీసుకురావడంలో భాతర్​ బయోటెక్, సీరంలు ముందున్నాయని పేర్కొన్నారు. త్వరలో అందరికీ విడతల వారీగా టీకాలు అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన మహిళా కార్పొరేటర్లు... మహిళా సాధికారతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ నాయకులు పేరాల శేఖర్​ రావు, కార్పొరేటర్లు, భాజపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పౌరులందరికీ ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నాం: ధర్మేంద్ర ప్రధాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.