దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. సిట్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన డీసీపీ సురేందర్‌రెడ్డిని కమిషన్ ప్రశ్నిస్తోంది.
ఎన్కౌంటర్, దానికి సంబంధించిన వివరాలతోపాటు... సిట్ సమర్పించిన నివేదికలోని పలు అంశాలను కమిషన్ ఆరాతీస్తోంది. సురేందర్‌రెడ్డి విచారణ ముగిసిన తర్వాత మృతుల కుటుంబ సభ్యులను నుంచి కమిషన్ సాక్ష్యాలు సేకరించనుంది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో 18 మంది సాక్ష్యులను విచారిస్తామని కమిషన్ ఇది వరకే తెలిపింది.
నిన్న జరిగిన విచారణలో సిట్ దర్యాప్తు అధికారి సురేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇవాళ కూడా ఆయన్ను ప్రశ్నిస్తోంది. దిశ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న మిగతా పోలీసు అధికారులనూ రేపు కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇవీచూడండి: