CID police charged on Itdp: ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించి మార్ఫింగ్ వీడియో సృష్టించి, సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారన్న ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐ- తెదేపా అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా, అనుబంధ ఖాతాలతోపాటు యూకే ఫోన్ నెంబర్ ఉన్న తెలుగుదేశం వాట్సప్ గ్రూపు, ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమ ఖాతాలపై.. నేరపూరిత కుట్ర, ఫోర్జరీ కింద అభియోగాలు మోపింది. గోరంట్ల మాధవ్ ఫిర్యాదుతో ఐపీసీలోని వివిధ సెక్షన్లు సహా ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ కింద కేసు రిజిష్టర్ చేసింది.
ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు వీడియో వెలుగుచూశాక .. దానిపై సమగ్ర విచారణ జరిపించాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు డీజీపీని ఆదేశించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని అఖిలపక్ష మహిళా నాయకులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటిదాకా ఏవిధమైన చర్యలు తీసుకోలేదు.