ఎప్పుడూ విధుల్లో తలమునకలై ఉండే ఆ ఉన్నతాధికారులు పొలం బాట పట్టారు. పని ఒత్తిడికి కాసింత విరామమిచ్చి అన్నదాతల్లా మారిపోయారు. తలకు పాగా చుట్టి వరి నాట్లు వేశారు. ఒక్కో నారు వేస్తూ మడిలో రైతన్నల్లా శ్రమించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతి-తిరుచానూరు మార్గంలో బుధవారం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా, ఎస్ఈబీ ఏఎస్పీ రిషాంత్ రెడ్డి కాసేపు పొలాల్లో గడిపారు. ఇద్దరు ఐఏఎస్లు, ఇద్దరు ఐపీఎస్ అధికారులు అలా క్షేత్రస్థాయిలో తిరగటం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కోర్ కమిటీ సమావేశం