గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ సమావేశంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్ అంకితభావం కలిగిన నాయకుడని, అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో తన మద్దతు తప్పని సరిగా ఉంటుందని చిరంజీవి తెలిపారు. సినిమాలో ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు వేసే విధంగా చేయలేదని ఆయన అన్నారు.
'సినిమాలో ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు వేయలేదు. మాతృకలో ఉన్న కథ ఆధారంగానే డైలాగులు రాశారు. డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను. భవిష్యత్‌లో నా మద్దతు తమ్ముడు పవన్‌కు ఉంటుంది. అంకితభావం కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కు అవసరం. ఆ అవసరాన్ని ప్రజలు పవన్‌కు ఇస్తారని భావిస్తున్నా.'-చిరంజీవి
ఇవీ చదవండి: