ETV Bharat / city

సమ్మక్క, సారలమ్మను చినజీయర్ అవమానించారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy on Chinna Jeeyar Swamy : సమ్మక్క-సారలమ్మపై చినజీయర్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి స్పందించారు. యాదాద్రి ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి తొలగించాలని సీఎంను కోరారు.

Revanth Reddy on Chinna Jeeyar Swamy
Revanth Reddy on Chinna Jeeyar Swamy
author img

By

Published : Mar 18, 2022, 3:32 PM IST

Updated : Mar 18, 2022, 3:45 PM IST

Revanth Reddy on Chinna Jeeyar Swamy : గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మపై త్రిదండి చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన తల్లులను అవమానపరిచిన చినజీయర్‌ను యాదగిరి గుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్​ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్​ను కోరారు.

చినజీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మహా కుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం ప్రెస్​నోట్​ విడుదల చేసింది. ఈ ప్రెస్​నోట్​తో పాటు సీఎం కేసీఆర్​, చినజీయర్​ స్వామి ఫొటోలను ట్విట్టర్​లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

  • తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన “సమ్మక్క సారలమ్మ”లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి...మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.@TelanganaCMO pic.twitter.com/xCqh4jRyE5

    — Revanth Reddy (@revanth_anumula) March 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం.. ఆ తర్వాతే దర్శనాలకు అనుమతి: ఈవో

Last Updated : Mar 18, 2022, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.