ETV Bharat / city

'బాలుడిని చితకబాదిన వ్యక్తిపై హత్యయత్నం కేసుపెట్టాలి' - A MAN ATTACK ON SEVEN YEARS OLD BOY IN HYDERABAD

హైదరాబాద్​ సువర్ణ రెసిడెన్సీలో బాలుడిపై దాడిచేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్​ చేశారు.

'బాలుడిని చితకబాదిన వ్యక్తిపై హత్యయత్నం కేసుపెట్టాలి'
author img

By

Published : Nov 11, 2019, 8:57 PM IST

హైదరాబాద్​ అల్వాల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సువర్ణ రెసిడెన్సీలో ఆడుకుంటున్న బాలుడిని విచక్షణారహితంగా దాడిచేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాలలహక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్​ చేశారు. నిందితుడిపై నాన్​బెయిలబుల్​ సెక్షన్ల కింద కేసులు నమోదుచేయాలని సైబరాబాద్​ సీపీని కోరినట్లు తెలిపారు.

ఏం జరిగిందంటే..

సువర్ణ రెసిడెన్సీలో నివసిస్తున్న క్రాంతి కుమార్​ అనే వ్యాపారి అదే అపార్టుమెంట్​లో ఉంటున్న బాలుడు జయంత్​ను ఈనెల 8న విపరీతంగా దాడిచేసి గాయపడిచాడని బాలుడి తల్లి వాపోయింది. అనంతరం తనకు ఫోన్​ చేసి దూషించాడని తెలిపింది. క్రాంతి కుమార్​పై అల్వాల్​ పోలీసులకు ఫిర్యాదుచేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని చెప్పింది. అందువల్లనే బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించామని పేర్కొంది.

క్రాంతి కుమార్​పై హత్యయత్నం కేసు నమోదుచేయాలని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​, బాలానగర్​ డీసీపీ పద్మజారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు వెల్లడించారు. పిల్లలను హింసించే మనస్తత్వం ఉన్నందున క్రాంతి కుమార్​ పిల్లలను శిశువిహార్​కు తరలించాలని కోరారు.

'బాలుడిని చితకబాదిన వ్యక్తిపై హత్యయత్నం కేసుపెట్టాలి'

ఇవీచూడండి: విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.