ETV Bharat / city

TSRTC : చిల్డ్రన్స్​కు ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్‌... టికెట్‌ లేకుండానే ప్రయాణించొచ్చు! - టీఎస్‌ ఆర్టీసీ వార్తలు

బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఆర్టీసీ (TSRTC) గిఫ్ట్ ఇచ్చింది. 15 ఏళ్లలోపు పిల్లలకు ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా చేయవచ్చని ప్రకటించింది.

TSRTC
TSRTC
author img

By

Published : Nov 14, 2021, 12:16 PM IST

బాలల దినోత్సవం సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈరోజు ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరంలేదని ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఏసీ, మెట్రో, డీలక్స్‌, ఆర్డీనరీ ఇలా ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని సూచించారు. బాలలదినోత్సవం సందర్బంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి : రాజకీయ ఉద్ధండుడు డీఎస్ దారెటు.. పెద్దాయనవైపా.. చిన్నాయనవైపా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.