రాజ్భవన్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు వేయి మంది చిన్నారులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల చిన్నారులను అభినందించారు.
సూర్యాపేట బాలల కేంద్రానికి చెందిన చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకొంది. బాల బాలికలు క్రమశిక్షణతో ఎంచుకొన్న గమ్యాలను చేరేందుకు కృషి చేయాలన్న గవర్నర్.. తల్లితండ్రులు, గురువుల సలహాలు పాటించాలని సూచించారు.
ఇవీచూడండి: పిల్లలుంటే ఇలా చేయండని చెబుతోన్న నాని