మృగాళ్లకు అత్యాచారం ఆలోచన రావాలంటేనే భయపడేలా కొత్త చట్టం తెస్తోంది పాకిస్థాన్(pakistan chemical castration). రేప్ కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేసే కీలక బిల్లు 'నేర చట్టం(సవరణ)-2021'కు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది(chemical castration law). దీంతో పాటే మరో 33 బిల్లులను కూడా పాస్ చేసింది.
పాకిస్థాన్‌లో అత్యాచార ఘటనలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దోషులకు కఠిన విధించాలని డిమాండ్ పెరిగింది. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి ఈ బిల్లును రూపొందించింది(pakistan latest news ). ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సుకు గతేడాదే పాకిస్థాన్ కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
రేప్ కేసు దోషులకు లైంగిక సామర్థ్యం తొలగించే ప్రక్రియను 'కెమికల్ కాస్ట్రేషన్'గా పిలుస్తారు(chemical castration law pakistan). వైద్యులు డ్రగ్స్‌ను ఉపయోగించి అత్యాచార దోషులు శృంగారానికి పనికిరాకుండా చేస్తారు. దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ సహా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ శిక్ష అమల్లో ఉంది.
పాకిస్థాన్‌లో(pakisthan news latest) నమోదయ్యే రేప్ కేసుల్లో 4 శాతం నిందితులు మాత్రమే దోషులుగా తేలుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇస్లాంకు వ్యతిరేకం..
అయితే రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష(chemical castration pakisthan) విధించడం సరికాదని జమాత్-ఎ-ఇస్లామి సెనేటర్ ముస్తాక్ అహ్మద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఇస్లాంకు, షరియా చట్టానికి వ్యతిరేకమన్నారు. రేప్ కేసు దోషులను బహిరంగంగా ఉరితీయడం సరైందేనని, కానీ షరియా చట్టంలో కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష ప్రస్తావన ఎక్కడా లేదని వాదించారు.
ప్రస్తుతానికి రేప్ కేసు దోషులకు లైంగిక సామర్థ్యం తొలగించే శిక్షను(chemical castration law) విధించి.. ఉరిశిక్షపై తర్వాత ఆలోచిద్దామని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఇదివరకే స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: suicide: ప్రేమ పెళ్లి చేసుకున్న 20 రోజులకే నవ వధువు మృతి... అసలు ఏమైంది..