ETV Bharat / city

తెదేపా నేతలపై.. అక్రమ కేసులు ఎత్తివేయాలి: చంద్రబాబు

author img

By

Published : Apr 7, 2021, 10:50 PM IST

ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనపై డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు.

chandrabau
చంద్రబాబు

దేవాలయాల్లో దాడులకు పాల్పడుతున్న అసలు నేరస్తుల్ని పోలీసులు పట్టుకోవాలని.. ఏపీ కుప్పం నియోజకవర్గంలో తెదేపా నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గొనుగునూరు గ్రామ పంచాయతీ పేటగుట్టలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ధ్వంసం ఘటన పరిణామాలపై డీజీపీకి లేఖ రాశారు.

'అధికార పార్టీతో కుమ్మక్కైన ఓ వర్గం పోలీసులు.. రాజకీయ కక్షసాధింపులో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలి. ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించి వాటిని కాపాడాలి. రాజకీయాలకు అతీతంగా పోలీసులు చర్యలు తీసుకుంటేనే దాడులు ఆగి.. పోలీసులపై నమ్మకం ఏర్పడుతుంది' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే 2019 జూన్ నుంచి రాష్ట్రంలో ప్రార్థనా స్థలాలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు లేఖలో తెలిపారు.

'ప్రభుత్వ ఉదాసీనతకు పేట్టగుట్ట ఘటనా తాజా ఉదాహరణ. నేరస్థులను పట్టుకోని పోలీసులు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈనెల 6న వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్​లు, ఎంపీటీసీ అభ్యర్థులు 40 మందిని అక్రమంగా అరెస్టు చేసి భోజనం కూడా పెట్టకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. 160 సెక్షన్ కింద వారికి నోటీసులు జారీ చేయటం అర్థ రహితం. వలస పాలనను తలపించేలా జరుగుతున్న పరిణామలను తెలుసుకునే యత్నం చేసిన ప్రతిపక్ష నాయకులపైనా కేసులు పెట్టారు. కుప్పం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైన పలువురు నాయకుల్ని గుడుపల్లి పోలీస్ స్టేషన్​లో ఉంచారు'

-- లేఖలో చంద్రబాబు

ఇదీ చూడండి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూకి ఆస్కారం లేదు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.