ETV Bharat / city

Chandrababu Kadapa Tour : ఆ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన - చంద్రబాబు కడప జిల్లా పర్యటన

Chandrababu Kadapa Tour news : నేటి నుంచి 2 రోజుల పాటు ఏపీలోని వరద ముంపు ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. నేడు కడప, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగనుంది. రేపు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.

Chandrababu news, Chandrababu Kadapa tour, చంద్రబాబు కడప టూర్, చంద్రబాబు కడప పర్యటన
CBN Kadapa Tour
author img

By

Published : Nov 23, 2021, 8:58 AM IST

Chandrababu Kadapa Tour news : ఆంధ్రప్రదేశ్​ కడప, చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటల తర్వాత బయలు దేరి కడప విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజంపేట మండలం తోగూరుపేట గ్రామాన్ని చేరుకుని బాధితులను పరామర్శిస్తారు. అనంతరం 12 గంటలకు మందపల్లె, 12.25కు పులపుత్తూరు, 12.45కు గుండ్లూరు గ్రామాల్లో పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నాం 2 గంటలకు రోడ్డు మార్గంలో తిరుపతికి వెళ్లనున్నారు.

చిత్తూరు జిల్లాలో పర్యటన

Chandrababu Chittoor Tour news : చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రహదారిలో ముంపునకు గురైన ఆటోనగర్‌ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం లక్ష్మీపురం కూడలి, ఎమ్‌ఆర్‌పల్లె, శ్రీకృష్ణానగర్‌, సరస్వతినగర్‌, గాయత్రినగర్‌, దుర్గానగర్‌ ప్రాంతాల్లో వరదప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ముంపు బాధితులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. అనంతరం రేణిగుంటలోని వై.కన్వెన్షన్‌ కేంద్రంలో బస చేయనున్నారు. బుధవారం ఉదయం తిరుచానూరు సమీపంలో కోతకు గురైన స్వర్ణముఖి నదిపై నిర్మించిన వంతెనను పరిశీలించనున్నారు. అనంతరం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.