ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో తెదేపా ఆధ్వర్యంలో ప్రజాచైతన్య యాత్ర నిర్వహించారు. హాజరైన చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం, పత్తికి మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అయినవాళ్లకే పనులు అప్పగించారని ఆరోపించారు. సున్నా వడ్డీకి ఎక్కడా రుణాలు ఇవ్వడం లేదన్నారు. ప్రజావేదిక కూల్చినప్పుడు ఎవరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదాయం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.
తెదేపా కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చేస్తున్న దానికి వడ్డీతో సహా చెల్లించే రోజు వస్తుందని హెచ్చరించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బెదిరించేందుకు వైకాపా నేతల యత్నిస్తున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకురావాలని కోరారు. స్థానికసంస్థల ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండీ... 3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: చంద్రబాబు