సినీ హీరో సాయి ధరమ్‌తేజ్ ఆరోగ్య పరిస్థితిపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుకి ఫోన్ చేసి సాయి తేజ్ యోగ క్షేమాలు అడిగారు. తేజ్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కోలుకుంటున్నారు: వైద్యులు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు సాయిధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ‘‘సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే అతడికి చికిత్స అందిస్తున్నాం’’ అని అపోలో ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి.
శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్ ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్- ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికవర్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: CM KCR REVIEW: దళితబంధు అమలుపై కేసీఆర్ సమీక్ష... సీఎల్పీ నేత భట్టి హాజరు